Thursday, 26 November 2015

shanti mantram

శిష్యుడు గురువు వద్ద విద్యాభ్యాసం ప్రారంభించే సమయంలో  ప్రతిభం దకాలు లేకుండా విద్యాభ్యాసం  పూర్తవుతుంది. కొరతలు ఇద్దరూ ప్రార్ధించే మంత్రం ఇది. దీ నివల్ల 

గణపతి మంత్రము

ఓం గణానాం త్వా గణపతిగ్o హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ !
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ !!
ఓం మహా గణపతయే నమః !!

దేవగణాలకు అధిపతివి , గణపతిగా వినుతికెక్కిన నిన్ను నుతిoచి , ఆహ్వానిస్తున్నాము. మేధావులలో నువ్వు అగ్ర గణ్యుడవు , సాటిలేని ఖ్యాతి గడించినవాడవు , ప్రధానులలో ముఖ్యుడవు , వేదాలకు అధిపతివి, మా వినతి ఆలకించి మమ్ము తక్షణం వచ్చి రక్షించు ! మహా గణాధిపతివైన నీకు నమస్కారము.

Monday, 23 November 2015

దుర్గా నామ జపం

"ఓం దుo దుర్గాయైనమః"
 ద్ + ఉ + ర్ + గ్ + అ  అనే  ఐదు  బీజాక్షరాలు కలిసిన నామం దుర్గ.
ద కారం  - దైత్యాన్ని ( మనలో ఉన్న రాక్షస గుణాలను) పో గొ డు పోగోడుతుంది.
ఉ కారం - మనం అనుకున్న పనులకు విఘ్నాలు రాకుండా చేస్తుంది.
ర కారం- రోగాలు రాకుండా రక్షిస్తుంది.
గ కారం- మనం చేసిన పాపాలను పోగొడుతుంది.
అ కారం - శత్రు నాశనం చేస్తుంది.
అందుకే దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది.

శ్రీ రామ" తారక మంత్రముతో శుభ ఫలితాలెన్నో..!

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

రఘువంశజుడు , దశరధ కుమారుడు, అప్రమేయుడు , జానకి నందుడు, రఘు వంశములోరత్నదీపము వంటివాడు, ఆజాను బాహుడు, పద్మనయనుడు, రాక్షసులను హరించినవాడు అగు శ్రీ రామునికి నమస్కరించుచున్నాను.

 - అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. జన్మతహ:కిరాతకుడై పుట్టిన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి "శ్రీమద్రామాయణం" రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు.

అడవుల్లో తిరుగుతూ వేటాడుతూ కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు "రామ రామ రామ" అనే తారక మంత్రమే తోడ్పడింది. కిరాతకుడైన బోయవాడిని నారదుడు చూసి నీవు చేస్తున్న ఈ కిరాతకమైన పాప కార్యంలో నీ భార్యబిడ్డలు ఏమైనా పాలుపంచుకుంటారో తెలుసుకుని రా అని పంపుతాడు.

వెంటనే ఆ కిరాతకుడు భార్యబిడ్డల వద్దకు వెళ్లి ఆ ప్రశ్న అడుగుతాడు. దానికివారు గృహస్తుడుగా మమ్ములను పెంచి పోషించే బాధ్యత నీది కానీ నీవు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామేతప్ప పాపకార్యంలో కాదు. అని నిష్కర్షగా పలుకుతారు. వారి పలుకులకు వైరాగ్యము చెందిన బోయవాడు మహర్షి నాకు చక్కని మోక్షమార్గానికి ఉపాయము చెప్పమని ప్రాధేయపడతాడు.

కిరాతకుని విన్నపము మేరకు నారదుడు "రామ రామ రామ" అనే తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. చివరకు నోరు తిరగక శరీరంపై పుట్టలు పోస్తున్నా "మర" అంటూనే ఆ తారకమంత్రాన్ని వీడలేదు. బ్రహ్మ అనుగ్రహముతో వల్మీకము నుండి పునర్జీవింపడి వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారకమంత్రముచే పొంది శ్రీమద్రారాయమణ అనుకమనీయకావ్యం రచించి కారణజన్ముడై ఊర్థ్వలోకమందు ఆ చంద్రతారార్కం తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయినాడు.

అట్టి శ్రీమద్రారామాయణం మనకు ఎంతో ఆదర్శవంతమైంది. అందలి శ్రీ సీతారామచంద్రమూర్తి మూర్తీభవించిన ధర్మదేవతా స్వరూపం. ఆ కావ్యమే మనకు మనభావితరాలకు మార్గదర్శి కానుంది.

కాబట్టి శ్రీరామ నవమి రోజున రామ నామ తారక మంత్రమును పఠించడంతో పాటు సీతారాముల కళ్యాణోత్సవం వీక్షించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాంటి మహిమాన్వితులపై శ్రీరామచంద్రులను శ్రీరామనవమి నాడు స్తుతించి వారి అనుగ్రహము పొందుదుము గాక..!.

Sunday, 22 November 2015

విపత్తుల యందు రామ మంత్రం

రామయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే !
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః !!
రాముణ్ణి ఏమని పిలిచేవారు:
అయోధ్యలో ఉన్న రాముణ్ణి, దశరథ కౌసల్య సుమిత్ర కైకమ్మలు 'రామ!' అని పిలిచేవారు.
మంత్రులు 'రామభద్రా!' అని సంబోధించేవారు.
అయోద్య ప్రజలు 'రామచంద్రా!' అని ,
రాముని చిన్నప్పటినుండీ ఎత్తుకు మోసి సేవచేసిన దాదులు 'రఘునాథా!' అని ,
సీతమ్మ మాత్రమే 'నాథా!' అని రామ చంద్రుణ్ణి గౌరవపూర్వకంగా పిలుస్తూoడేవారు.
మిథిలా నగరంలో వున్న వారు మాత్రం శ్రీరాముణ్ణి 'సీతాపతీ!' అనే పలకరిస్తూoడేవారు.

ఈ నామాలను నిత్యం పఠిచడం వల్ల దుస్కరమైన సంసార బంధాల నుండి విముక్తి పొంది మోక్షము పొందుతారు.     ( పద్మపురాణము)

పై మంత్రమును వేకువ జామున లేచి స్నానము చేసి 108 పూసల జపమాలను తీసుకొని  108 సార్ల చొప్పున 7 సార్లు జపించవలను . అలా ఒకసారి జపించిన తరువాత గుగ్గిలము అగ్నిలో వేసి హోమము చేయ్యాలి.
పైన చెప్పినట్టు 7 సార్లు ఆచరించి ఆ హొమబస్మమును భద్రపరిచి ప్రతి రోజు ధరించాలి. కార్యసిద్ది కై వెళ్ళినపుడు తప్పకుండా ధరిస్తే ఆ కార్య మార్గము సులభతరమై విప్పత్తులన్నీ పోవును.

Saturday, 21 November 2015

కలికల్మషనాశక మహా మంత్రం

కృతయుగంలో తపస్సుచే , తే త్రా యుగంలో యజ్ఞాలచే, ద్వాపర యుగంలో అర్చనచే వచ్చే ఫలితాలు కలియుగంలో ఒక్క సంకీర్తన వల్ల సులభంగా సిద్ధిస్తాయి.

హరే ! రామ ! హరే ! రామ !
రామ ! రామ ! హరే ! హరే !
హరే ! కృష్ణ ! హరే ! కృష్ణ !
కృష్ణ ! కృష్ణ ! హరే ! హరే !

సాక్షాత్తూ శ్రీహరే రాముడు !
ఆ రాముడే సాక్షాత్తూ, శ్రీ హరి !
శ్రీహరే సాక్షాత్తూ శ్రీకృష్ణుడు!
శ్రీకృష్ణుడే సాక్షాత్తూ శ్రీ హరి!

బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశించిన 16 నామాలు గల ఈ మంత్రాన్ని జపిస్తే కాలిదోషం సమూలంగా హరించుకు పోతుoది. కలియుగంలో  పాము వలె చుట్టుకున్నకాలిదోష నివారణకు దీనిని మించిన సాధన,సులభొపాయము మరొకటి కనపడదు.  దీనిని స్మరించిన వారికి అనంత పుణ్యము, అభిష్ట ఫలము కలుగుతాయి.(కృష్ణ యజుర్వేదము)



శక్తినిచ్చే సూర్యమంత్రం

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!
               ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా  నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు.  శాంతిని వొసంగువాడవు.
                మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము. కాలంలో జీవితoఉంది, నాదం ఎంతో ప్రాచీనమనిపిస్తుంది. ఆ నాదం మన గ్రహం సూర్యునిచుట్టూ ప్రదక్షిణం చేయటంవల్ల ప్రభవిస్తోంది. విశాలవిశ్వపు వెలిగి, ఆరే విరాట దీపంలా కనిపిస్తున్నాడు సూర్యుడు.

మహా మృత్యుంజయ మంత్రం

" దీనిని త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్ "

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.
ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.
ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.
* త్ర్యంబకం: భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.
* యజామహే: అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.
* సుగంధిం: సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.
* పుష్టివర్థనం : మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
ఉర్వారుకం – ఇవ – బంధనం : దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.
* మృతోర్ముక్షీయ: అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

* అమృతాత్ : స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
" శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు "

శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.
మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం,
రావణ వథానంతరం అయోధ్యకు చేరుకున్న రామ చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు. అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం.
ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.
ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.
ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.
మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.

ఓం నమ: శివాయ ‘ మంత్రం

‘ఓం నమ: శివాయ ‘ అనే మంత్రం సకల శుభాలను కలిగిస్తుందని పెద్దల వాక్కు.
" కితస్య బహుభిర్మం త్రై:

కింతిర్థై: కిం తపోధ్వరై:
యస్య నమశ్శివాయేతి "

మంత్రో హృదయ గోచర: అని అన్నారు. అంటే, ఎవరి హృదయంలో నిరతరం “ఓం నమ: శివాయ” అనే మంత్రం జపించబడుతుంటుంతో, వారికి ఇతర మంత్రాలతో, తీర్థయాత్రలతో, యజ్ఞయాగాదులతో పని లేదని భావం. ఓం నమశ్శివయ (షడక్షరీ) నమశ్శివాయ (పంచాక్షరీ) మంత్రాలలో ఏ ఒక్క మంత్రాన్ని అయినా శ్రద్ధతో జపించే వ్యక్తి సమస్త శుభాలను పొందగలుగుతాడు.
అలాగే మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్రదీక్షలో హోమభస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు.
ఇది అందరికీ, అంటే శైవులకు, వైష్ణవులకు, మాధ్వులకు ప్రామాణికమయిన మంత్రం.

ఓం ‘నమశ్శివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెప్తారు. ‘రుద్రం’లో వేదాల మధ్యభాగంలో ‘నమశ్శివాయ’ అనే మంత్రం లిఖితపూరకంగా లభించింది. ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు. పంచాక్షరీ మంత్రం... మన ఆత్మ, శరీరం, ఉనికి అనీ, ఇది అందరినీ రక్షించే రక్షణ మంత్రమని పండితుల విశ్వాసం. దీనికి సరైన అర్థం ఇవ్వడం చాలా కష్టం. ఓం అనే దానికి ‘నేను నమస్కరిస్తున్నాను’ అని అర్థం. కాని ఈ మాత్రం వివరణతో ఆ మంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చినట్టు కాదు. ‘శివ’ అంటే పవిత్రుడు అని అర్థం. అందుకే ‘పవిత్రతకు తల వంచి నమస్కరించడం’ అనే అర్థం చెప్పవచ్చు. పుస్తకాలలో ‘శివుడు’ అనే పదానికి చెప్పే ‘వినాశకారుడు’ అనే అర్థాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు. శివుడు అంటే నాశనం లేనివాడు అని మంత్రానికి ఉన్న అర్థం కన్నా, ఆ శబ్దం నుంచి వచ్చే ధ్వనితతరంగాలకు ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మిగిలిన మంత్రాలలాగే ఈ మంత్రానికీ అర్థం కన్నా శబ్దమే ప్రధానం. అందువల్ల ఈ పదాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలి.

శివుడు అంటే ‘నిరాకారుడు’ అనే అర్థాన్ని చెబుతారు. అలాగే ఆయనను ‘పరమశివుడు’ అని కూడా అంటుంటారు. అంటే ‘భగవంతుని అంశ’ అని అర్థం. ఈ అంశ అందరిలోనూ అంతర్భాగంగా ఉంటుందని, ఇది విడదీయలేనిదని శైవుల విశ్వాసం. అయితే ఇది మనిషిలో నుంచి విడిపోవడానికి బయటకు కనిపించే పదార్థం వంటిది కాదు. హృదయానికే హృదయంలాంటిది. ఇది అయిదు అక్షరాల సమాహారం.

ఓం నుంచే అన్నీ ఆవిర్భవించాయి
న, మ, శి, వ, య. మంత్రం ఓం కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని పెద్దలు చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి. ‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తుందన్నప్పటికీ ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అన్నారు. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు కొందరు పెద్దలు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రపడి, మనసు ప్రశాంతం అవుతుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమోగుణం, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.

అనంతమైన అర్థం పరమార్థం
ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాల (పృథివ్యాపస్తేజోవాయురాకాశః) తో నిండిన శరీరం శుభ్రపడుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. న భూమికి సంబంధించిన భాగాలను, మ నీటికి సంబంధించిన భాగాలను, శి అగ్నికి సంబంధించిన భాగాలను, వ గాలికి సంబంధించిన భాగాలను, య ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.




సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం ...

1. ఓం నమఃశివాయ - పoచాక్షరి మంత్రం .
'న'కారం -బ్రహ్మ యొక్క భూమి
'మ'కారం-విష్ణు మూర్తి యొక్క వాయువు
'శి 'కారం -రుద్రుని అగ్ని
'వా 'కారం -మహేశ్వరుని వాయువు
'య 'కారం -సదాశివుని ఆకాశం
ఈ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే త్రిముర్తులతో పాటు పంచభూతాలను స్మరించినట్టు .

రామనామం

సకల లోకంలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి.
లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారథిని నిర్మిస్తూ ఉంది. రాయిపై 'రామ' అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తె అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి 'నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే రాయి వేస్తే' అనే ఆలోచన కలిగింది.దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే వున్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు . అందుకు "రామ" అనే నామం రాసిన రాళ్ళే పైకితేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా! అందుకే మునిగిపోయింది" అని హనుమంతుడు సమాధానం చెప్పాడు. అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైందో కదా!

రామాయణం కంటే బలమైన రామనామం 
రావణాసురుని చంపిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో "రామా ! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు" అని రాముడిని ఆదేశించాడు.
విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు 'రామ' నామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. 'రామ' నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా నారదమహర్షి అక్కడకు చేరుకుని "మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించమనాలా? 'రామ' నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి" అని విశ్వామిత్రుడితో చెప్పాడు.
ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమయింది. యుగయుగాలకు సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం 'రామనామం.'
'రామత్తత్వో అధికం నామ 
మితి మాన్యా మహేవయమ్ 
త్వయై కాతౌతారి తయోధ్యా 
నామ్నుతు భువన త్రయమ్'
అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు. అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది. రామనామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం.
'ఓం నమో నారాయణాయ' అనే అష్టాక్షరి మంత్రంలోని 'రా' అనే ఐదవ అక్షరం ' ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రంలోని 'మ' అనే రెండవ అక్షరం కలిస్తే ' రామ' అనే నామం అయింది. అంటే హరిహరతత్త్వాలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామనాయం!
'రామ' అనే పదాన్ని గమనిస్తే ర, అ, మ లు కలిస్తే 'రామ' అవుతుంది.'ర' అంటే అగ్ని. 'ఆ' అంటే సూర్యుడు, 'మ' అంటే చంద్రుడు అని అర్థం. అంటే 'రామ' అనే పథంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా 'రామ' అనే నామంలోని 'రా' అనే అక్షరం భక్తులను సంసారసాగరం నుంచి రక్షిస్తుందనీ 'మ' అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా 'రామ' అనే పదంలోని 'రా' అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయనీ, 'మ' అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని చెప్పబడుతుంది. అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు
'శ్రీరామ రామరామేతి రమే రామ మనోరమే 
సహస్త్రనాయ తత్తుల్యం రామనామ వరాననే' అని పేర్కొన్నారు.
'రామ రామ రామ' అని మూడుసార్లు నామ జపం చేస్తే శ్రీవిష్ణుసహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట. అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి.
కిరాతకుడిని వాల్మీకిని చేసిన రామనామం 
వాల్మీకి మహర్షి జీవితమే రామనామ మహిమకు చక్కని నిదర్శనం. నిజానికి ఆయన కిరాతకుడు. మహర్షులు చెప్పినట్లుగా 'మరా' అనే మాటను జపం చేస్తూ కొంతకాలానికి 'మరా' అనే పదం 'రామ' గా మారింది. ఆయనపై వల్మీకం (పుట్ట) పెరిగింది. చివరకు నారదమహర్షి ఉపదేశంతో వెలికి వచ్చి రామనామ గొప్పదనాన్ని తెలుసుకొని 'వాల్మీకి' ఆయి రామాయణాన్ని మనకు అందించాడు. రాముడికంటే రామనామం గొప్పది.
శనిబాధాలు చేరనివ్వని రామనామం 
పూర్వం ఒకసారి శనేశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవహించి కష్టాలపాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ వున్నాడు. హనుమంతుడిని సమీపించి శనేశ్వరుడు తన మనస్సులోని కోరికను చెప్పగా "నేను ప్రస్తుతం రామనామజపంలో మునిగివున్నాను. రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు" అని సమాధానం ఇచ్చాడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు. రామనామజపాన్ని హనుమంతుడు ఎప్పుడు మిగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు. గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదెన్నడు? చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించేవారి దరిచేరడం కష్టమని తెలుసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు. అంటే శనీశ్వరుడి దరి చేరనీయని శక్తివంతమైన నామం 'రామనామం' కాబట్టి 'రామ' నామాన్ని జపించే వారి శనిబాధలతో పాటు ఎటువంటి గ్రహబాధలు వుండవని చెప్పబడుతుంది.
హనుమంతుని రక్షగా ఉంచే రామనామం 
'యత్ర యత్ర రఘునాథ కీర్తనం 
తత్ర తత్ర కృత మస్తకాంజలి 
బాష్పవారి పరిపూర్ణలోచనం 
మారుతీం సమత రాక్షసాంతకం'
అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ వుంటుందో అక్కడ కళ్ళునిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి వుంటారట రాక్షసులను దోమలలాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు. దీనిని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ ప్రక్కనే వుంటాడు. మనలను రక్షిస్తూ వుంటాడు. అనగా రామనామ జపం కేవలం 'రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపజేస్తుంది.
రామనామ సంకీర్తన 
శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము 
రామనామము రామ నామము రామ నామము రామ నామము 
శ్రీమదఖిల రహస్తమంత్ర విశేషధామము శ్రీరామనామము 
దారినొంటిగ నడుచువారికి తోడు నీడే శ్రీరామనామము...
ఇలా ప్రారంభమై సాగే రామనామసంకీర్తనను ప్రతిరోజూ 'ఉభయ' సంధ్యలలో పఠించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఎటువంటి సమస్యలైనా గట్టెక్కే ధైర్యం కలుగుతుంది. అంతేకాకుండా అనేకసార్లు విష్ణు సహస్త్ర నామ పారాయణం చేసిన ఫలం లభిస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. వీలున్నవారు సామూహికంగా కూడా చేయడం మంచిది.
నామమంత్రం 
'శ్రీరామ జయ రామ జయ జయ రామ' అనేది పదమూడు అక్షరాల నామ మంత్రం. దీనిని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి శ్రీరాముడి ప్రత్యక్ష దర్శనాన్ని పొందినట్లు పురాణకథనం. వీలున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ వుండడం శ్రీరామరక్ష.
రామకోటి 
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం 
ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం 
అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు. రాసేవారు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీరాముడి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

నారాయణ అష్టాక్షరి

మంత్రములలో శిరోభూషణంగా వేదములు, ఋషులు అంగీకరించింది నారాయణ అష్టాక్షరి, ఇది తెలియవల్సిన అర్థాలనన్నింటిని స్పష్టంగా తెలుపుతుంది. అన్ని గ్రంథాల్లో మనకు తెలియాల్సిన విషయాలు అక్కడక్కడా చెదిరి ఉంటాయి, వాటినన్నింటినీ ఒక చోట చేర్చి చూపేది నారాయణ అష్టాక్షరీ మహా మంత్రం. ఇది ముఖ్యంగా మూడు విషయాలను అందులో ఉన్న పదముల ద్వారా తెలియజేస్తుంది. ఈ మంత్రం ఎనిమిది అక్షరములు లేక మూడు పదములు కలిగి ఉంటుంది. ఈ మంత్రం ఆవిర్భవించే సమయంలోనే ఎనిమిది అక్షరాలతో ఆవిర్భవించింది. అందులో ఉన్నవి ఓం ఒక పదం, నమో ఒక పదం మరియూ నారాయణాయ అనేది మరొక పదం. ఇలా మూడు పదాల క్రింద విడదీస్తే మొదటి పదం మన స్వరూపం ఏమిటి అనేది చెబుతుంది. రెండో పదం మనం ఏమిచేయాలో చెబుతుంది, ఉపాయం అని అంటారు. మూడోది ఉపాయాన్ని పట్టుకొని పొందాల్సింది ఏమిటి అని చెబుతుంది, దీన్నే ప్రాప్యం లేక ఉపేయం అని అంటాం. ఇలా మూడు పదాలుగా విడదీసి చెప్పుకోవడం అందులో కల ఒక అందం. అట్లా కాక రెండు పదాలుగా విడదీసి అంటే, 'ఓం నమో' అని ఒక పదంగా, 'నారాయణాయ' అని రెండో పదంగా విడదీసి కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మొదటి పదం మనం ఏమాత్రం తనంతట తానుగా ప్రవర్తించగలిగినది మన స్వరూపం కాదు అని చెబుతుంది. కేవలం వెనకాతల నడిపించే వాడిపైనే ఆధారపడి ఉంటుంది. దీన్నే పరతంత్రత అని అంటారు. అంటే మన స్వరూపం పరతంత్రతను కలిగినది, కనుక మనం చేయదగినది వాడిముఖ వికాసం కలిగించే సేవ, దీన్నే కైంకర్యం అని అంటారు. ఇలా ఇదొకరకంగా చెప్పుకొనే విధానం.

మంత్రం అర్థం

మంత్రం అర్థం తెలియక అనుసంధానం చేసుకున్నా ఉపయోగకరమే, అయితే మంత్ర అర్థం తెలిసి చేసుకుంటే ఎంతో ఉపయోగ దాయకం. మనకు ఏర్పడే మానసిక చికాకులని తొలగిస్తుంది. లోకంలో మనకు కర్మ వల్ల వచ్చేవి వస్తూనే ఉంటాయి, పోయేవి పోతూ ఉంటాయి. వీటిని ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయరు. వచ్చే వాటిని ఎట్లా గ్రహించాలో తెలియక పోవడంచేత ఎన్నో విచారాలు చేస్తుంటాం. మన మానసిక స్థితిని బట్టి ఆనందం, దుఖం అనేవి తప్ప ఉన్నవాటితో లేక లేనివాటితో కాదు. మనల్ని గొప్ప ఆనంద స్థితిలో ఉంచగలిగే మహా మంత్రం అష్టాక్షరి. మంత్రాన్ని అనుసందించాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి, కానీ దాని అర్థాన్ని మనం తెలుసుకుంటే దాన్ని ఎల్లప్పటికీ స్మరించుకోవచ్చు, అందుకు నియమం లేదు. అట్లా అర్థానుసంధానం చేసుకోవడానికి పిళ్ళై లోకాచార్య స్వామివారు మనకు ఎన్నో సూత్రాల ద్వారా అందించారు.

గాయత్రి మంత్రము

”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”
గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.
1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య
ప్రతిపదార్ధం :
ఓం : ప్రణవనాదం
భూః : భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌
భూవః : రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌
సువః : స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌ ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి.
తత్‌ : ఆ
సవితుర్‌ : సమస్త జగత్తును
వరేణ్యం : వరింపదగిన
భర్గో : అజ్ఞానాంధకారమును తొలగించునట్టి
దేవస్య : స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను
ధీమహి : ధ్యానించుచున్నాను
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను
కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి.


గాయత్రి మంత్రంలో ఉన్న మూడు భాగాలు

1. మొదటి భాగం ప్రణవ మంత్రమైన ఓం. 

2. రెండవ భాగం ప్రణవ మంత్రాన్ని విప్పి చెప్పే భూః, భువః, సువః అనే మూడు వ్యాహృతాలు. ఇవి స్థూల స్థితిలో భూమి, పితృలోకం, దేవలోకాన్ని సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులు - మనసు, శరీరం, ప్రాణం అనే మూడు స్థితులలోను పనిచేసి మన జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి. 

3. ఇక మూడో భాగం తత్...ప్రచోదయాత్ అనేది సావిత్రీ మంత్రంగా చెప్పబడింది.

మొత్తం మీద, ప్రణవం, వ్యాహృతి, సావిత్రి - ఈ మూడు కలిసిందే గాయత్రి. గాయాతం త్రాయతే ఇతి గాయత్రి - అంటే, జపించేవారిని తరింపజేస్తుంది కాబట్టి ఇది గాయత్రీ అని పేరు పొందింది. ఋగ్వేదంలో చెప్పబడింది.
 

అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం. అనన్యం,సర్వసిద్ధిప్రదం.

1. త - అజ్ఞానాన్ని పోగొట్టునది
2. త్స - ఉపపాతకములను నివారించునది
3. వి - మహాపాతములను నివారించునది
4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.
5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది
6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది
7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.
8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది
9. భ - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.
10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.
11. దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది
12. వ - గురు హత్యాపాపాన్ని నివారించును.
13,. స్య - మానసిక దోషాలను నివారించును
14. ధీ - మాతృ, పితృ వధా పాతకాన్ని పరిహరించును.
15. మ - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును
16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును
17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును
18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.
19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును
20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును
21. ప్ర - విష్ణులోక ప్రాప్తి
22. చో - రుద్రలోక ప్రాప్తి
23. ద - బ్రహ్మలోక ప్రాప్తి
24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.

గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.

గాయత్రి - తూర్పు దిక్కును
సావిత్రి - దక్షిణ దిక్కును
సంధ్యాదేవి - పడమర దిక్కును
సరస్వతి - ఉత్తర దిక్కును
పార్వతి - ఆగ్నేయాన్ని
జలశాయని - నైరుతిని
పవమాన విలాసిని - వాయువ్య దిక్కును
రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక
తుత్ - పాదాలను
సవితుః - జంఘలను
వరేణ్యం - కటిని
భర్గః - నాభిని
దేవస్య - హృదయాన్ని
ధీమహి - చెక్కిళ్ళను
ధియః - నేత్రాలను
యః - లలాటంను
నః - శిరస్సును
ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.
ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగమ్ శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.

తత్ - శిరస్సు
సకారం - ఫాలం
వి - నేత్రాలు
తు - కపోలాలు
వ - నాసాపుటాలు
రే - ముఖం
ణి - పైపెదవి
యం - కింది పెదవి
భ - మద్య భాగం
ర్గో - చుబుకం
దే - కంఠం
వ - భుజాలు
స్య - కుడి చేయి
ధీ - ఎడమ చేయి
మ - హృదయం
హి - ఉదరం
ధి - నాభి
యో - కటి
యో - మర్మప్రదేశం
నః - తొడలు
ప్ర - జానువులు
చో - జంఘం
ద - గుల్ఫం
యా - పాదాలు
త్ - సర్వ అంగాలు

ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.


గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలలో 24 దేవతలున్నారన్నది మన పెద్దలమాట. గాయత్రీమంత్రం పరబ్రహ్మ స్వరూపం. మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రీమంత్రానికి అంతటి ప్రాముఖ్యత.

ఓం భూర్భవస్సువ: తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్

గాయత్రీమంత్రం 24 అక్షరాలలో -

1. “తత్” - గణేశుడు ,
2. “స” - నృసిం హస్వామి,
3. “వి” - విష్ణు,
4. “తు” - ఈశ్వరుడు,
5. “వ” - శ్రీకృష్ణ,
6. “రే” - రాధాదేవి,
7. “ణి” - లక్ష్మీదేవి,
8. “యం” - అగ్నిదేవుడు,
9. “భ” – ఇంద్రుడు,
10. “గో” – సరస్వతీదేవి,
11. “దే” – దుర్గాదేవి,
12. “వ” - హనుమాన్,
13. “స్య” - భూదేవి,
14. “ధీ” - సూర్యభగవానుడు,
15. “మ” - శ్రీరామచంద్రుడు,
16. “హి” - సీతాదేవి,
17. “ధి” - చంద్రుడు,
18. “యో” - యమధర్మరాజు,
19. “యో” - బ్రహ్మదేవుడు,
20. “న:” - వరుణదేవుడు,
21. “ప్ర” - నారాయణుడు,
22. “చో” – హయగ్రీవుడు,
23. “ద” - హంసదేవత,
24. “యత్” - తులసీమాత.

ఇందులో ఎవరి ఇష్టదేవతను వారు ఆ దేవత గాయత్రీ మంత్రంతో జపించి ఆ దేవతా అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చొప్పున 40 రోజులపాటు ఆ దేవతాచిత్రం ముందు కూర్చుని ధూప, నైవేద్యాలతో పూజించి, ఆ దేవత మంత్రాలను 108 సార్లు జపించితే అనుకున్న కోరికలు నెరవేతురాయి.

అదే విధంగా ‘మంత్రసిద్ధి’ ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది.

ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చు. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణ ప్రదాలు. వాటి ఉచ్ఛారణతో సంకల్పాలు సిద్ధిస్తాయిన్నది పెద్దల వాక్కు. అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలు చేయకూడదు, ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది.

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది? అన్న ప్రశ్న మనకు కలుగవచ్చు. అందుకు సమాధానం, త్రికాల వేదులెైన ఋషులు, జగత్‌ కళ్యాణం కోసం అందించిన సత్యోపదేశాలే ‘మంత్రాలు’. 

ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, చంధస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం, అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది.

1. ఋషి: మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచేత ఆవిష్కరింపబడిందో, ఎవరిచేత సిద్ధి పొందిందో, అతనినే ఆ మంత్రానికి కర్తగా (ఋషిగా) భావించాలి.
2. ఛందస్సు: శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పు తున్న దాన్నికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సు లు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమ ను తాము కాపాడుకొనేందుకు గాయత్రీ వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకొన్నారు.
3. దేవత: ప్రతి మంత్రానికి ఒక అధిష్టాత దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్ఠాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి.
4. బీజం: మంత్రానికి ప్రత్యేకశక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి.
5. శక్తి: మనం మంత్రశక్తిని వహించినప్పుడే, అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి.
6. కీలకం: మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి, ఆత్మసాక్షాత్కారంతో సర్వసిద్ధులను పొందుతాడు.
7. అంగన్యాసం: అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ర్పయోజనమవుతాయి. శరీరశుద్ధికోసం న్యాసాలు తప్పనిసరిగి చేయాలి. సాధకులున్యాసాలు చేసుకొని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు.

వినియోగం

వినియోగం: చతుర్దిధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అని అంటారు.ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం. పండుగ సమయాలో గ్రహణ సమయాలలో అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.మంత్రాలు కర్మార్థమై జనించాయి. ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వలన ఆ మంత్రానికి సంబంధించిన దెైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఉదాహరణకు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ, ‘నారాయణ’ అనే మంత్ర జపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి. భక్త హనుమ ‘రామ’ జపంతో ఉత్తేజితుడెై సముద్రాన్ని దాటి లంకను చేరాడు. గాయత్రీ మంత్ర జపం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మార్షిత్వాన్ని పొందాడు.

మంత్రాలు రెండు రకాలు.

1. దీర్ఘమంత్రాలు, 2. బీజామం త్రం. మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు (మంత్రాలు) ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూలశబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది. దీర్ఘమంత్రాలు వేదపాఠాల వలె గాన రూపములో ఉంటాయి. వీట్లో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది.

చంధోబద్ధంగా ఉన్న మంత్రాలు ‘ఋక్కులు’ అని గద్యాత్మకంగా ఉన్న మంత్రాలను ‘యజస్సులు’ అని అంటారు. ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణవాయువు లేని నిర్జీవ శరీరం వంటిది. ఓంకారం ఆ సర్వేశ్వరుని నుంచి ఒక జ్యోతిగా ప్రారంభమై, దాన్నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది. ఋగ్వేదం - ‘అ’ కారం, యజుర్వేదం నుండి ‘ఉ’ కారం, సామవేదం నుండి ‘మ’ కారం కలసి ‘ఓం’ కారం ఏర్పడింది.

సాధారణంగా మంత్రాలు మూడు విధాలు.

1. తామస మంత్రం: క్షుద్రంతో ఉచ్ఛారణ చేసేవి.
2. రాజస మంత్రం: యుద్ధంలో గెలుపు కోసం చేసేవి.
3. సాత్విక మంత్రం: ఆధ్యాత్మిక సాధనకై చేసేవి.

* ఏకాక్షర మంత్రం - ‘ఓం’

అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం’. దీనినే ‘ప్రణవం’ అని కూడా అంటారు. మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన. ఉదా బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చి, ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవతా మూర్తులు, మంత్రోచ్ఛారణతో మనం మననం చేయగానే మన పట్ల ప్రసన్నలవుతున్నారు.
మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. ‘ఐం, శ్రీం, హ్రీం, క్లీం’ అనే ఏకాక్షర బీజ మంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి. ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం.

సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది. అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం ‘ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజః సత్త్వ, తమో గుణాలకు ప్రాతినధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు.




ఓం అనే పదాన్ని తీసుకుంటే, ఇది ఒక పదమా ? లేక అక్షరమా ? లేక వాక్యమా ? భాషలో అచ్చులు, హల్లులు కలిసి ఉంటాయి. కొన్ని హల్లులు అచ్చులు కలిసి అర్థాన్ని ఇవ్వగలిగితే పదం అని అంటాం. 'గోవు' ఇది కొన్ని అక్షరాల కలయిక,ఆ కలయిక ద్వారా ఒక అర్థాన్ని ఇవ్వగల శక్తి దానిలో ఏర్పడింది, కనుక పదం అని అంటాం. అలానే కొన్ని పదములు కలిసి మన సంశయాలను తీర్చగలిగినట్లుగా అర్థం ఇవ్వగలిగితే దాన్ని వాక్యం అని అంటాం. 'గోవు పాలు ఇచ్చును' ఇలా కొన్ని వాక్యాలు కలిసి మనకు గోవు ఏమి చేస్తుంది అనే సంశయాన్ని తీర్చి, ఒక అర్థాన్ని ఇస్తుంది కనక అది ఒక వాక్యం అని అంటాం. 'ఓం' అనేది అక్షరమా ? 'ఓం ఇత్యేకాక్షరం' అంటుంది వేదం. అంటే ఓం అనేది ఒక అక్షరం. భగవద్గీతలో భగవానుడు 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామ్ అనుస్మరన్' అని చెబుతాడు. ఓం అనేది ఒక అక్షరం, ఇది బ్రహ్మ, ఇది వేదం. ఏం చెబుతుంది అది ? 'మామ్ అనుస్మరన్' నన్ను తలవాలి అని చెప్పాడు. ఇది స్వతంత్రంగా అర్థాన్ని ఇవ్వ గలదు కనక దీన్ని ఒక పదం అని కూడా అనవచ్చు. ఇది కొన్ని అక్షరముల కూర్పు కూడా. అవి 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు. ఈ మూడు అక్షరాలు కలిసి ఒక పదం అయ్యింది. మామూలుగా కొన్ని అక్షరాలు కలిసి పదం అయ్యి ఒక అర్థాన్ని ఇస్తాయి, కానీ ఒక్కో అక్షరాన్ని విడదీస్తే ఏమి అర్థాన్ని ఇవ్వవు. ఇక్కడ ఓంకారంలో ఉన్న 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు ఒక్కోటి విడి విడి అర్థాన్ని ఇవ్వగలవు. అట్లా అకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు, ఉకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు, మకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు. కనుక ఇవి మూడు పదాలు అని కూడా చెప్పవచ్చు. ఇలా మూడు పదాలు కలిసిన ఓంకారం ఒక స్వతంత్ర అర్థాన్ని ఇవ్వగలదు, మన సంశయాలను తీర్చగలదు కనక వాక్యం అని చెప్పవచ్చు. అందుకే ఓంకారాన్ని ఒక అక్షరం అని చెప్పవచ్చు, ఒక పదం అని చెప్పవచ్చు లేదా ఒక వాక్యం అని చెప్పవచ్చు. ఓంకారంలో ఉన్న 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు ఒక్కోటి ఏం అర్థాన్ని ఇస్తాయో తెలుసుకోవాలి, పదంగా ఏం అర్థాన్ని ఇస్తాయో తెలుసుకోవాలి అట్లా వాక్యంగా కలిసి ఏం అర్థాన్ని ఇస్తాయో కూడా తెలుసుకోవాలి.

మహాత్ములు మనకోపం కొన్ని ప్రాధమిక మంత్రాలను సూచించారు. అవి:

‘ఓం’ : సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది. అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం ‘ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజః సత్త్వ, తమో గుణాలకు ప్రాతినధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు. వేదం ఓంకారరూపం, వేదరాశి, ఋగ్వేదం నుండి ‘అ’ కారం, యజుర్వేదం నుండి ‘ఉ’ కారం, సామవేదం నుండి ‘మ’ కారం పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.

శ్రీం: అమ్మ వారికి చెందిన మంత్రం ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.
హూం: సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దెైవికక్రోధం యొక్క శబ్దం ‘హూం’. ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.
రాం:ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.
ఐం: జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.
మాం: మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.
సోహం: ఊపిరి యొక్క స్వాభావిక బీజం. ‘సో’ ఉచ్ఛ్యాసం, ‘హం’ నిశ్శ్వాసం. సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం. ‘సో’ శక్తి ‘హం’ శివుడు.
గాయత్రీ మంత్రం: ఓం కారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ సూత్రాలలో, పురాణాలలో గాయత్రీ దేవత సగుణ, నిర్గుణ, స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి. గాయత్రీ దేవని గాయత్రీ మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది. ఎవరు గాయత్రీని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు.

మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా! వాటిని స్థానిక భాషలోకి తర్జుమా చేసుకొని దెైవాన్ని పూజించకూడదా?

మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా! వాటిని స్థానిక భాషలోకి తర్జుమా చేసుకొని దెైవాన్ని పూజించకూడదా? అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు సమాధానం ఒక్కటే.మంత్రం శబ్దప్రధానమైనది. ధ్వనాత్మక సృష్టిపదార్థం సృష్టి కంటే ముందే పుట్టింది. ఇతర తత్త్వాలకంటే శబ్దతత్త్వం శక్తి వంతమైనది. కాబట్టి మంత్రానికి ఆధారం శబ్దం అయింది. సంస్కృత భాషలోని అక్షరాలలో శబ్దం, అర్థం రెండూ ఉన్నాయి. ఈ అక్షరాల నిర్మాణం వల్ల అనేక మహిమలు కలుగుతాయి. అందుకే మిగతా భాషల కంటే సంస్కృతం ఉతృ్కష్టమైన మంత్ర ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సంస్కృతం మంత్రంలో నుండి ఉద్భవించింది మరి.

మంత్ర శక్తి మహిమ

మనసును ప్రక్షాళనం చేసి, నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు మంత్రాలు. జన్మగత వాసనలతో, మనలను కట్టి పడవేసి, ఆచేతన, సుప్తచేతన ఆలోచనల, కోరికలను చేధించడానికి మంత్రం సహాయపడుతుంది. మంత్రం మన మనసు పొరల్లో దాగియున్న పలురకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా, మనస్సాక్షిగా, ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తారుు. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తారుు. ఉదాహరణకు ‘హుం’ కారం మనలోని భయాన్ని పారద్రోలుతుంది. ‘రాం’ కారం మనకు శాంతిని కలుగచేస్తుంది.
మంత్రంలో ‘మ’కారం అంటే మననం, మననం అంటే పదేపదే ఉచ్ఛరించడం. ‘త్రం’కారం అంటే త్రాణం, త్రాణం అంటే రక్షించేదని అర్థం, కాబట్టి ‘మంత్రం’ అంటే ఏకా గ్రచిత్తంతో పదేపదే ఉచ్ఛరించే వానిని రక్షించేదని అర్థం.మననం చేయువానిని రక్షించేది మంత్రమని అర్థం. మంత్రత అనేది నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఒక బీజం (విత్తనం) పెద్దచెట్టు గా వృద్ధిచెందినట్లు, నిర్గుణ బ్రహ్మమే మంత్రంగా సూచించ బడింది.మంత్ర వివరణపెై అనేక నిర్వచనాలు కనిపిస్తున్నాయి. తన హృదయం నుండి అవగతమయ్యే శక్తే మంత్రమనీ, దేవతా దిష్టితమైన ఒకానొక అక్షర రచనా విశేషమే మంత్రమనీ, దేవతా స్వరూపమే మంత్రమనీ, సాధనకు, కార్యసిద్ధికి, ప్రత్యేక ఫలితాలకు ప్రకృతి శాస్త్రాలను అనుసరించి వివిధ ప్రక్రియలలో అభ్యాసమూలమైన సిద్ధిత్వాన్ని కలిగించేదే మంత్రమనీ కొన్ని అక్షరాల ప్రత్యేక ఉచ్ఛారణే మంత్రమనీ, ఒక శబ్దాన్ని యాంత్రికంగా, పారవశ్యం కలిగేంతవరకు పునశ్చరణ పారవశ్యం కలిగేంతవరకు పునశ్చరణ చేయడమే మంత్రమని అంటారు.
ఈ జగత్తు అంతా దెైవానికి ఆధీనమై ఉంది.

అటువంటి దెైవం మాత్రం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. కాబట్టి శబ్ధరూపం లోనున్న దెైవశక్తి స్వరూపమే మంత్రం, మంత్రాన్ని ధ్యాని స్తున్నప్పుడు ఆ మంత్రం దేవతామూర్తి యొక్క శక్తి సాధకుని లో అణువణువు వ్యాపించి ఉంటుంది. అప్పటివరకు నిబిఢీకృ తమై ఉన్న దెైవికశక్తులు సాధకునికి ఉపయోగపడి జ్ఞానోదయ మవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, మాలిన్యాలు తొలగి, మనస్సు నిశ్చలమై, సచ్చిదానంద స్థితిని పొందుతాడు. అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడిన వే మంత్రాలు. శక్తికి, శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమయిన రీతిలో జరిగే మంత్రో చ్ఛారణ వలన, మంత్రంలోనున్న బీజాక్షరాలలో స్పందన కలి గి, అత్యద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది. యోగసా ధన సఫలీకృతమయ్యేందుకు యోగాశక్తి ఎలా అవసరమో, అదే విధంగా మంత్రసాధన ఫలించేందుకు విశేషమైన మాన సిక ఏకాగ్రత అవసరం. ఈ వాక్‌ శక్తీకరణ కలిగినప్పుడు, మనం కొన్ని సాధారణ శబ్దాలలో నిగూఢమైన అర్థాలను చూడగలం. అవి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సమస్తవిశ్వంతో సంభాషొంచే స్థితికి సాధకుని తీసుకెళ్తాయి.

ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం. పండుగ సమయాలో గ్రహణ సమయాలలో అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.

saraswathi mantram

ఓం ప్రాణో దేవీ సరస్వతీ వాజేభివాజినీపతి!
                 ధినామవిత్ర్యవతు !!ఓం!!

నమస్కరించే యావన్మందినీ కాపాడే సరస్వతీదేవి మనులను కాపాడుగాక!
    మనలోని వాక్ శక్తులను ప్రేరేపించి మనలను జాగృతం చేయుగాక !

Wednesday, 11 November 2015

జపం ఎలా చెయ్యాలి ?

జపం ఎలా చెయ్యాలి ?

                    
మన ఇష్టదైవం యొక్క నామాన్ని కానీ., మంత్రాన్ని కానీ., ఒక క్రమపద్ధతిలో భక్తిగా జపించే విధానాన్నే జపం అంటారు. రోజుకు ఇన్నిసార్లు జపం చెయ్యాలనే సంఖ్యానియమం కూడా ఉంటుంది. ఒకవేళ అనుకోని ఇబ్బందులవల్ల ఆ రోజు జప సంఖ్య పూర్తి చేయలేని పక్షంలో., మరునాడు ఈరోజు మిగిలిన జపసంఖ్యను చేర్చి చేయవలసి ఉంటుంది. జపాన్ని ఏదో మొక్కుబడిగా చెయ్యకూడదు. సంఖ్య పూర్తిచెయ్యడమే ప్రధాన లక్ష్యంగా జపం చెయ్యకూడదు. భక్తి చాలా ప్రధానం. జపం చెయ్యడానికి ఒక పద్ధతి ఉంది.                వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధః స్మృతః
               త్రయాణాం జపయఙ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరమ్

జపం.. వాచికము, ఉపాంశువు, మానసికము అని మూడు విధాలుగా ఉంటుంది.
వాచికము: బయటకు వినిపించే విధంగా జపం చేసే పద్ధతిని ‘వాచికము’ అంటారు.
ఉపాంశువు: బయటకు వినిపించకుండా, కేవలం పెదవులు కదుపుతూ నాలుకతో జపం చేసే విధానాన్ని ‘ఉపాంశువు’ అంటారు.
మానసికము: నాలుక, పెదవులు కదలకుండా మౌనంగా మనస్సు లోలోపలే జపం చేసే విధానాన్ని ‘మానసికము’అంటారు.ఈ మూడింటిలో వాచికము కంటే ఉపాంశువు., ఉపాంశువు కంటే మానసికము మరింత శ్రేష్ఠము అని శాస్త్ర ప్రమాణము.                 హస్తౌ నాభిసమౌ కృత్వా ప్రాతస్సంధ్యా జపం చరేత్
                హృత్సమౌ తు కరౌ మధ్యే సాయం ముఖ సమౌ కరౌ

ప్రాతః కాలమునందు చేతులు నాభి వద్దకు చేర్చి., మధ్యాహ్నమునందు చేతులు హృదయము వద్దకు చేర్చి., సాయంకాలమునందు చేతులను ముఖమునకు సమాంతరముగా ఉంచి జపం చేయవలెను. చందనపూసలతో, అక్షతలతో, పూవులతో, ధాన్యముతో, మట్టిపూసలతో జప సంఖ్యను లెక్కించకూడదు. లక్క, దర్భ, సిందూర పూసలతో కానీ., ఎండిన ఆవుపేడ పూసలతో కానీ రుద్రాక్ష, తులసి, స్ఫటిక పూసలతో కానీ చేసిన జపమాలలతో జప సంఖ్యను లెక్కించుట శ్రేష్ఠము.

జపమాల: పమాలలో 108 పూసలు ఉంటాయి. మాల రెండు కొసలు కలిపే పూసను ‘సుమేరుపూస’ అంటారు. జపము చేయునప్పుడు జపమాల కనిపించకుండా వస్త్రాన్ని కప్పి చేయాలి. కానీ, ఆ వస్త్రం తడిగా ఉండకూడదు. జపమాలను అనామిక వ్రేలు (ఉంగరపు వ్రేలు) పైనుంచి బొటనవ్రేలుతో పూసలను లెక్కించవలెను. చూపుడువ్రేలును ఉనయోగించరాదు. సుమేరుపూసను దాటి ముందుకు పోరాదు. సుమేరేపూస దాకా వచ్చిన తర్వాత మాలను వెనుకకు త్రిప్పి  జపము చేయవలెను. ఒకవేళ జపమాల చేతినుంచి జారి క్రిందపడినచో, ఆ జపసంఖ్య లెక్క లోనికి రాదు. మరల జపమాల మెదటి నుంచి జపము చెయ్యాలి.  జపమాల కాలికి తగిలిన ఎడల, దానిని నీటితో కడిగి రెట్టింపు సంఖ్యలో జపం చెయ్యాలి. జపము చేయునప్పుడు మాట్లాడుట కానీ, కదులుట కానీ చేయరాదు. ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, క్షమాభావనతో భగవంతుని స్మరించి తిరిగి జపం ప్రారంభించాలి. గృహమునందు జపము చేసిన దానికన్న గోశాలయందు వందరెట్లు, వనములందు లేదా తీర్థస్థానములందు వేయిరెట్లు, పర్వతములమీద పదివేలరెట్లు, నదీతీరములందు లక్షరెట్లు, దేవాలయములందు కోటిరెట్టు, శివలింగము దగ్గర అనంతమైన పుణ్యఫలము లభించునని శాస్త్ర ప్రమాణము.
- See more at: http://www.teluguone.com/devotional/content/right-way-to-do-japam-278-33101.html#sthash.mkUB2G1a.dpufSee more at: http://www.teluguone.com/devotional/content/right-way-to-do-japam-278-33101.html#sthash.mkUB2G1a.dpuf